హైదరాబాద్‌-భూపాలపట్నం, మరో జాతీయ రహదారి విస్తరణ

తెలంగాణలో పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, బొగత జలపాతాలను అనుసంధానం చేస్తూ హైదరాబాద్‌-భూపాలపట్నం మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరిస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం వెల్లడించారు.

Published : 25 Nov 2022 04:03 IST

తెలుగు రాష్ట్రాలకు ముఖద్వారంగా కొల్లాపూర్‌ వంతెన
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, బొగత జలపాతాలను అనుసంధానం చేస్తూ హైదరాబాద్‌-భూపాలపట్నం మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరిస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం వెల్లడించారు. ఇందుకుగాను రూ.136.22 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ మార్గం విస్తరణతో బహుళ ప్రయోజనాలున్నాయి. ములుగు జిల్లాలోని అత్యంత సుందర ప్రాంతాలైన లక్నవరం సరస్సు, బొగత జలపాతాల అందాలను ప్రజలు మరింతగా ఆస్వాదించేందుకు ఇది ఉపకరిస్తుంది. తీవ్రవాద ప్రభావిత జిల్లా కావడంతో ఈ రహదారి విస్తరణతో ఆ ప్రాంతంపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరుగుతుంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రహదారి అనుసంధానత మరింత విస్తరించినట్లు అవుతుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.

మార్గం విస్తరణకు రూ.436.91 కోట్లు..

కొల్లాపూర్‌ వద్ద కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ బ్రిడ్జి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య మరో ముఖద్వారం కానుందని మంత్రి గడ్కరీ తెలిపారు. వంతెనకు వెళ్లే మార్గం విస్తరణకు రూ.436.91 కోట్లు మంజూరు కాగా కొంతమేర రెండు వరుసలుగాను, మరికొంత ప్రాంతం నాలుగు వరుసలుగాను రహదారి విస్తరణ చేపడతారని వెల్లడించారు. ‘‘కృష్ణానదిపై వంతెన నిర్మాణంతో హైదరాబాద్‌, కల్వకుర్తి, తిరుపతి, నంద్యాల, చెన్నై మధ్య దూరం  80 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఆయా ప్రాంతాలకు ప్రస్తుతం 44వ నంబరు జాతీయరహదారి మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. విస్తరణ, వంతెన నిర్మాణం పూర్తయితే 167-కే జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగుతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని