వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీతో జేఎన్‌టీయూ అవగాహన ఒప్పందం

పరిశోధన, విద్యాపరమైన కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీతో జేఎన్‌టీయూ అవగాహన ఒప్పందం చేసుకుంది.

Published : 25 Nov 2022 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: పరిశోధన, విద్యాపరమైన కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీతో జేఎన్‌టీయూ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో రెండు వర్సిటీల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమానికి వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ అధ్యక్షుడు, ఉపకులపతి ప్రొ.బార్నె గ్లోవర్‌, ప్రతినిధులు దేబొర స్వీని, లిండా టేలర్‌, అండర్‌సన్‌, నిషా రాకేశ్‌ హాజరవ్వగా.. జేఎన్‌టీయూ తరఫున ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌, ఐఎస్‌టీ వాతావరణ విభాగ అధిపతి విజయలక్ష్మి పాల్గొన్నారు. జేఎన్‌టీయూలో బీటెక్‌లో చేరిన విద్యార్థులు మూడున్నరేళ్లు ఇక్కడ చదివాక.. మరో ఏడాదిన్నర వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీలో చదివి పీజీ పూర్తి చేయవచ్చని కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. పర్యావరణ శాస్త్రం, వాతావరణ మార్పులపై ఇరు వర్సిటీలు కలిసి పనిచేయనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని