Published : 25 Nov 2022 04:03 IST

అధికారులు అనుభవాలతో పుస్తకాలు రాయాలి

డీజీపీ మహేందర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ పోలీసు అధికారులు తమ అనుభవాలతో పుస్తకాలు రాయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. అవి యువ పోలీసు అధికారులకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. హైదరాబాద్‌లోని పోలీసు ఆఫీసర్స్‌ మెస్‌లో అదనపు డీజీ (శాంతిభద్రతలు) జితేందర్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) డీజీ ఉమేష్‌ షరాఫ్‌ రచించిన ‘ఎకనమిక్‌ అఫెన్సెస్‌- హ్యాండ్‌బుక్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’ పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావంలోనూ మార్పులు వస్తున్నాయన్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తుపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన ఉండాలని, ఉమేష్‌ షరాఫ్‌ రచించిన పుస్తకం దోహదపడుతుందన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్‌ పీఎస్‌ రామ్మోహన్‌రావు, మాజీ పోలీసు ఉన్నతాధికారులు ఎంవీ కృష్ణారావు, అరవిందరావు, సాంబశివరావు, రాజీవ్‌ త్రివేది, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమేష్‌ షరాఫ్‌ రచించిన మరో పుస్తకం ‘క్రిమినాలజీ అండ్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌’ పరిచయ కార్యక్రమం జరిగింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని