అమ్రాబాద్‌ అభయారణ్యానికి.. ‘యాదాద్రి థర్మల్‌’ ఎంత దూరంలో ఉంది?

యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది.

Published : 25 Nov 2022 05:22 IST

కేంద్ర పర్యావరణ శాఖ ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది. ఈ అధ్యయనాన్ని 9 నెలల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని తాజాగా సూచించింది. విద్యుత్తు కేంద్రం నిర్మించే స్థలం అమ్రాబాద్‌ అభయారణ్యానికి ఎంత దూరంలో ఉంది అన్న అంశాన్ని నిర్ధారించి చెప్పాలని తెలిపింది. పది కి.మీ దూరంలోపు ఉంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 2న జరిగిన పర్యావరణ సమీక్ష కమిటీ సమావేశంలో ఈ విద్యుత్తు కేంద్రంపై చర్చించినట్లు తెలిపింది.  రూ.29,965.48 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులో 61.50 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖకు జెన్‌కో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని