ఆ మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏం చేద్దాం?

గోదావరిపై నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లకు సాంకేతిక సలహా సంఘం(టీఏసీ) ఆమోదం పొందేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది.

Published : 25 Nov 2022 05:22 IST

ఈఎన్‌సీ, సీఈలతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష 

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరిపై నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లకు సాంకేతిక సలహా సంఘం(టీఏసీ) ఆమోదం పొందేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. గురువారం జలసౌధలో ఈఎన్‌సీ, సీఈలతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన దిల్లీలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) నేతృత్వంలో నిర్వహించే సమావేశంలో టీఏసీ ముందుకు చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, ముక్తేశ్వర్‌(చిన్న కాళేశ్వరం), చనాకా-కొరాటా ప్రాజెక్టుల డీపీఆర్‌లు పరిశీలనకు రానున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం, హైడ్రాలజీ తదితర సాంకేతిక అంశాలను కమిటీ పరిశీలించనుంది. అభ్యంతరాలు, సందేహాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి నివృత్తి చేసుకోనుంది. టీఏసీ ఆమోదం లభిస్తే వాటి డీపీఆర్‌లు జల్‌శక్తి మంత్రిత్వశాఖకు చేరుతాయి. ఈ అంశంపై నీటిపారుదల శాఖ అధికారులు శుక్రవారం కూడా కసరత్తు చేయనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు