రోడ్డు వెడల్పుతో శిక్ష.. స్థలమార్పిడితో రక్ష

సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా-161 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా నుంచి మహారాష్ట్ర సరిహద్దు మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వరకు భారీ వృక్షాలను తొలగించక తప్పలేదు.

Updated : 25 Nov 2022 06:26 IST

సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా-161 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా నుంచి మహారాష్ట్ర సరిహద్దు మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వరకు భారీ వృక్షాలను తొలగించక తప్పలేదు. వీటిలో కొన్నింటినైనా బతికించాలన్న లక్ష్యంతో అటవీశాఖ.. స్థలమార్పిడి ప్రక్రియను చేపట్టి సఫలమైంది. పిట్లం రేంజ్‌ పరిధిలోని నిజాంసాగర్‌ మండలం మంగ్లూర్‌, మాగి, జుక్కల్‌ అటవీ ప్రాంతాల్లో 142 వృక్షాలను యంత్రాల సాయంతో ఒకచోటు నుంచి మరోచోటుకి మార్చారు. ఏడాదిన్నర అనంతరం వేప, మర్రి వంటివి తిరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. టేకు, చింత మాత్రం ఎండిపోయాయి. మొత్తంగా 115 చెట్లు తిరిగి జీవం పోసుకున్నాయి. ‘మా సిబ్బంది రెండు నెలలపాటు రోజూ నీరు పెడుతూ అవసరమైన రసాయనాలు చల్లుతూ ఈ ప్రక్రియను విజయవంతం చేశారు’ అని కామారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారిణి నిఖిత తెలిపారు.

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts