28న అంతర్జాతీయ డిపార్చర్స్‌ టెర్మినల్‌ మూసివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కోసం 2018లో హజ్‌ టెర్మినల్‌ సమీపంలో నిర్మించిన టెర్మినల్‌ను ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేస్తున్నారు.

Updated : 26 Nov 2022 03:56 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కోసం 2018లో హజ్‌ టెర్మినల్‌ సమీపంలో నిర్మించిన టెర్మినల్‌ను ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేస్తున్నారు. విమానాశ్రయ విస్తరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన టెర్మినల్‌ను సిద్ధం చేశామని, విమాన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌వీ-753 తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్‌ సౌదీ అరేబియాకు ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన టెర్మినల్‌ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అదనపు వివరాలకు 040-66546370 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని