నల్లమల అడవుల్లో కొత్త మొక్క

నల్లమల అడవుల్లో ఇటీవల కొత్త మొక్కను కనుగొన్నారు. జడ్చర్ల పట్టణంలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డా.బి.సదాశివయ్య, ఏపీ జీవ వైవిధ్య మండలి సభ్యుడు డా.ప్రసాద్‌, ఓయూ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన నిర్మల బాబూరావు, పరిశోధక విద్యార్థులు దీనిని గుర్తించారు.

Published : 26 Nov 2022 03:46 IST

జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే: నల్లమల అడవుల్లో ఇటీవల కొత్త మొక్కను కనుగొన్నారు. జడ్చర్ల పట్టణంలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డా.బి.సదాశివయ్య, ఏపీ జీవ వైవిధ్య మండలి సభ్యుడు డా.ప్రసాద్‌, ఓయూ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన నిర్మల బాబూరావు, పరిశోధక విద్యార్థులు దీనిని గుర్తించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గడ్డిజాతులపై చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఈ మొక్కను గుర్తించినట్లు సదాశివయ్య తెలిపారు. యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కకు యుఫోర్బియా తెలంగాణెన్సిస్‌గా నామకరణం చేశామని తెలిపారు. ఇది సుమారు 30 సెం.మీ. పొడవు పెరిగి, పాలవంటి లేటెక్స్‌ (జిగురు లాంటి పదార్థం) కలిగి ఉంటుందన్నారు. మొక్కలో ఔషధ గుణాలుండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ మొక్క గురించి ఫైటోటాక్సా అనే జర్నల్‌లోనూ సవివరంగా ప్రచురితమైందని వివరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు