సంస్కరణలు, అభివృద్ధితోనే రాష్ట్రానికి అవార్డులు

తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న  కార్యక్రమాలను దేశమంతా ఆదర్శంగా తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 03:46 IST

మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న  కార్యక్రమాలను దేశమంతా ఆదర్శంగా తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయస్థాయిలో తెలంగాణకు అవార్డుల రూపంలో గుర్తింపు లభిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర పురపాలికలు ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా 26 అవార్డులు దక్కించుకున్నాయని మంత్రి ప్రశంసించారు. గతంలో 16 స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులను రాష్ట్రంలో పురపాలికలు సొంతం చేసుకోగా ఐఎస్‌ఎల్‌ విభాగంలో 3అవార్డులు, తాజాగా ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ సిటీ కేటగిరీలో 7 అవార్డులు దక్కించుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని