తట్టును ఎదుర్కొందాం
మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో తట్టు(మీజిల్స్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు ఉంటే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత
ఇంటింటి సర్వే.. లక్షణాలున్న వారి నమూనాల సేకరణ
ఆరోగ్య శాఖ అత్యవసర ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో తట్టు(మీజిల్స్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు ఉంటే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకూ మీజిల్స్ రూబెల్లా టీకా తీసుకోనివారికి ఇవ్వడంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతామహంతి ఆదేశాలు జారీ చేశారు. 2023లో మీజిల్స్ రుబెల్లాను నిర్మూలించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ప్రకటించారు. తట్టు సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, చీదినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. చిన్నారులు, పౌష్ఠికాహార లేమితో బాధపడుతున్నవారు, అప్పుడే పుట్టిన శిశువులు, అయిదేళ్లలోపు చిన్నారులు, 20 ఏళ్లు పైబడినవారు, గర్భిణుల్లో తట్టు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బారిన పడినపుడు శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. న్యుమోనియా బారినపడతారు. నీళ్ల విరేచనాలు బాధిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా చిన్నారుల్లో తీవ్ర అస్వస్థతకు లోనవుతారు.
టీకా ఎప్పుడిస్తారు?
సార్వత్రిక రోగ నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు 9 నెలల నుంచి ఏడాది వయస్సు ఉన్నప్పుడు ఒక డోసు.. 16 నెలల నుంచి రెండేళ్ల వయసుకు వచ్చినప్పుడు రెండో డోసును ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్‌తో పాటు విటమిన్ ఏ డోసులు కూడా వైద్యులు ఇస్తారు. ఎంత పకడ్బందీగా టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా.. మొదటి డోసు నుంచి రెండో డోసుకు వెళ్లేసరికి సుమారు 10 శాతం మంది ఈ టీకాను పొందడం లేదు. అందుకే జిల్లాలో అత్యవసర కార్యాచరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
అత్యవసర కార్యాచరణ..
* మహారాష్ట్ర పొరుగు రాష్ట్రం కావడం.. అక్కణ్నుంచి తెలంగాణకు నిత్యం రాకపోకలు కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని నిర్ణయించారు. మహారాష్ట్ర నుంచి వచ్చినవారిపై దృష్టిపెడతారు.
* మీజిల్స్ రుబెల్లా టీకాను పొందని చిన్నారులను అత్యవసరంగా గుర్తించి వారికి సాధ్యమైనంత త్వరగా టీకాను అందజేయాలి.
* ఏఎన్ఎం, ఆశాలు ఇంటింటికీ తిరిగి జ్వరంతో కూడిన దద్దుర్లు ఎవరికైనా వచ్చాయా? అని అన్ని వయసుల వారిని అడిగి తెలుసుకోవాలి. లక్షణాలుంటే వెంటనే వారి నుంచి నమూనాలను స్వీకరించి పరీక్షలకు పంపిస్తారు.
* రాష్ట్రంలో జ్వరం కూడిన దద్దుర్ల వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.
* సేకరించిన నమూనాలను రాష్ట్రంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయానికి పంపించాలి. అక్కడ ప్రయోగశాలలో పరీక్షించి మీజిల్స్ వ్యాధి ఉందా? లేదా? అనేది నిర్ధారిస్తారు.
* ఎవరికైనా జ్వరం, దద్దుర్లతో పాటు ఒళ్లు, కండరాల నొప్పులుంటే.. వారిని 7 రోజులపాటు విడిగా ఉంచి.. అవసరమైన చికిత్స అందించాలి.
* అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్లను తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aero India Show: ఏరో ఇండియా షో.. నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో?
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?