ముమ్మరంగా మల్కాన్‌గిరి-భద్రాచలం రైల్వే సర్వే

మల్కాన్‌గిరి-భద్రాచలం రైల్వే ప్రాథమిక సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతిపాదిత భద్రాచలం రైల్వే స్టేషన్‌, ప్రస్తుతం ఉన్న పాండురంగాపురం (బూర్గంపాడు మండలం) రైల్వే స్టేషన్‌ మధ్యలోని కృష్ణసాగరం వద్ద మణుగూరు ప్రధాన రహదారి పక్కన ప్రస్తుతం భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Published : 26 Nov 2022 04:40 IST

కృష్ణసాగరం వద్ద భూగర్భ పరీక్షలు

అశ్వాపురం, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి-భద్రాచలం రైల్వే ప్రాథమిక సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతిపాదిత భద్రాచలం రైల్వే స్టేషన్‌, ప్రస్తుతం ఉన్న పాండురంగాపురం (బూర్గంపాడు మండలం) రైల్వే స్టేషన్‌ మధ్యలోని కృష్ణసాగరం వద్ద మణుగూరు ప్రధాన రహదారి పక్కన ప్రస్తుతం భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మల్కాన్‌గిరి-భద్రాచలం రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం 2021, సెప్టెంబరులో ఆమోదం తెలిపింది. రూ.2,800 కోట్లతో 173 కిలోమీటర్ల మేరకు చేపట్టనున్న ఈ మార్గం సర్వే పనులకు ఈ ఏడాది సుమారు రూ.3 కోట్లు కేటాయించారు.

ఏమిటీ ప్రాజెక్టు?: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి పట్టణం, భద్రాచలాన్ని ఈ రైలుమార్గం అనుసంధానిస్తుంది. ప్రస్తుతం భద్రాచలానికి రైలుమార్గం లేదు. కొత్తగూడెంలోని ‘భద్రాచలం రోడ్‌’ రైల్వేస్టేషనుగా ఉంది. పాండురంగాపురం, మణుగూరు స్టేషన్లు భద్రాచలానికి కొంత సమీపంగా ఉన్నాయి. తాజా మార్గం ఏర్పాటుతో భద్రాచలానికి నేరుగా రైలు సౌకర్యం కలగనుంది. నిజానికి దీన్ని మల్కాన్‌గిరి-భద్రాచలం రైలుమార్గంగా వ్యవహరిస్తున్నా.. ఇది పాండురంగాపురం నుంచే ప్రారంభమవుతుంది.  ఒకటి, రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని