Warangal: కళ్లు లేకున్నా.. బండి లోపం ఇట్టే పట్టేస్తారు!

అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటిచూపు కోల్పోయినా వెరవక.. తాను నేర్చిన పరిజ్ఞానంతో ఆటో మెకానిక్‌గా ముందుకెళ్తున్నారు హఫీజ్‌.

Published : 27 Nov 2022 09:38 IST

అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటిచూపు కోల్పోయినా వెరవక.. తాను నేర్చిన పరిజ్ఞానంతో ఆటో మెకానిక్‌గా ముందుకెళ్తున్నారు హఫీజ్‌. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన ఈయన తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయారు. 2005లో దీపావళికి ఇంటి ముందు పేల్చిన టపాసుల కారణంగా కుడి కన్నూ పోగొట్టుకున్నారు. జీవితం నిండా కారుచీకటి కమ్ముకున్నా భయపడలేదు.. ప్రజాప్రతినిధులు, దాతలు ఓ పాత ఆటో కొనివ్వగా, దాన్ని అద్దెకిస్తూ వచ్చే సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎలక్ట్రీషియన్‌గా తనకున్న అవగాహనతో ఆటోకు మరమ్మతులు చేయటం ప్రారంభించిన ఆయన.. ఇపుడు ద్విచక్ర వాహనాల రిపేరింగ్‌నూ మొదలుపెట్టారు. వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టే బండిలోని లోపాన్ని గుర్తించి ఇట్టే మరమ్మతులు చేస్తున్న హఫీజ్‌ పనితనాన్ని గుర్తించిన వాహనదారులంతా ఆయన వద్దకు చేరుతున్నారు.  రుణం అందిస్తే  మెకానిక్‌ షెడ్డు ఏర్పాటు చేసుకుంటానని అంటున్నారు హఫీజ్‌.

ఈనాడు,హనుమకొండ;న్యూస్‌టుడే,కాశీబుగ్గ

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు