ఆర్జీయూకేటీలో ఇద్దరిదే హవా
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించాల్సిన బాసర ఆర్జీయూకేటీ అనేక తప్పిదాలకు నిలయంగా మారింది.
పలు అక్రమాలకు ఆ ఉద్యోగులే సూత్రధారులు!
తాజాగా ఒక విద్యార్థినికి వేధింపులు..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ, చర్యలు కరవు
నిర్మల్, ముథోల్ (బాసర)- న్యూస్‌టుడే
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించాల్సిన బాసర ఆర్జీయూకేటీ అనేక తప్పిదాలకు నిలయంగా మారింది. ఈ విద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి.. అవసరమైన వసతులు కల్పిస్తామని, మెరుగైన విద్యను అందిస్తామని, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ఆ మధ్య.. విద్యాలయాన్ని సందర్శించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఇక్కడి సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేక వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందట విద్యార్థుల ఆందోళన, ఓ విద్యార్థి ఆత్మహత్య, మతప్రచారం, ర్యాగింగ్, తాజాగా విద్యార్థినులకు వేధింపులు.. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నా, పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవట్లేదు. ర్యాగింగ్ పేరిట విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగితే.. పది రోజుల తర్వాత అయిదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వారిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బందిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఆ ఇద్దరు ఉద్యోగులు తనను వేధిస్తున్నారంటూ ఇటీవల ఒక విద్యార్థిని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.
ప్రలోభాలతో బ్లాక్మెయిల్
గణాంక విభాగంలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసిన ఆ ఇద్దరు ఉద్యోగులు ఇంతకుముందున్న అధికారుల ఆశీస్సులతో పదోన్నతులు పొందారు. కళాశాలలో వీరు చెప్పిందే వేదం. మిగతా ఉద్యోగులు వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. ఆన్లైన్ వ్యవస్థ అంతా వీరి చేతిలో ఉండటంతో ఫీజులో రాయితీలు, బయటకు వెళ్లేందుకు పాసుల వంటి ప్రలోభాలతో విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే ధోరణిలో ఆ ఉద్యోగులు తనను వేధిస్తున్నారని ఓ విద్యార్థిని తాజాగా ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.
అధికారుల పొంతన లేని జవాబులు
తమ విద్యార్థులెవరూ వేధింపులకు గురికాలేదని, మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకరిద్దరు ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలియడంతో.. విచారణకు ఏకసభ్య కమిటీని నియమించామని ఆయన తెలిపారు. మరో ఉన్నతాధికారి మాత్రం.. గేట్ పాసులు, ఇతర అవకతవకలకు పాల్పడిన ఇద్దరిపై వేటు వేసినట్లు మౌఖికంగా చెబుతున్నారు. ఆ ఉద్యోగులకు సంబంధించి సెల్ఫోన్లు, దస్త్రాలు, బీరువాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు అధికారుల ప్రకటనలు వేర్వేరుగా ఉండటం విద్యాలయంలో అయోమయానికి నిదర్శనం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!