రాష్ట్రంలో 11కు పెరిగిన గేట్‌-2023 పరీక్ష కేంద్రాలు

రాష్ట్రంలో గేట్‌-2023 పరీక్ష కేంద్రాల సంఖ్య ఏడు నుంచి పదకొండుకు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 27 Nov 2022 03:55 IST

కొత్తగా మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కొత్తగూడెం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గేట్‌-2023 పరీక్ష కేంద్రాల సంఖ్య ఏడు నుంచి పదకొండుకు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కొత్తగా మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కొత్తగూడెంలలోనూ పరీక్ష రాయొచ్చని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతంలో తాను రాసిన లేఖకు స్పందించారని.. ఈ క్రమంలో గేట్‌-2023 పరీక్షల నిర్వహణ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడిక విద్యార్థులు పూర్తి సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో గతంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌ నగరాలలోనే గేట్‌ పరీక్ష కేంద్రాలు ఉండేవి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తీరును వివరిస్తూ కిషన్‌రెడ్డి లేఖ రాయడంతో తాజా నిర్ణయం వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని