అన్ని దేశాలకు ఆదర్శం

భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, దేశఐక్యత, సమగ్రతకు మూలమని, అన్ని దేశాలకు అది ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

Updated : 27 Nov 2022 05:21 IST

ఆర్టికల్‌ 3తోనే తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారం: తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, దేశఐక్యత, సమగ్రతకు మూలమని, అన్ని దేశాలకు అది ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3తోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను పొందుతూ.. కాపాడుకుంటూ.. విలువలను పాటించాలన్నారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. ఏడు దశాబ్దాలకు పైగా భారత్‌ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ రాజ్యాంగ రక్షతో దేశ ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి మాట్లాడుతూ హక్కులను అనుభవిస్తూనే విధులను అందరూ గౌరవించాలని సూచించారు. రాజ్యాంగంపై అన్ని వర్గాల ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పించాలని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో...

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర తాత్కాలిక సచివాలయమైన బీఆర్‌కే భవన్‌ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి శేషాద్రి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. బీసీ కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సభ్యులు, ఉద్యోగులతో కలసి ప్రతిజ్ఞ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని