Brahmamgari Matam: వెలుగులోకి బ్రహ్మంగారి పాద ముద్రలు
వైయస్ఆర్ జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలమను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు.
బ్రహ్మంగారిమఠం, న్యూస్టుడే: వైయస్ఆర్ జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలమను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. కొండపైన ఉన్న పాదముద్రలను శనివారం ఆయన పరిశీలించారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి గుర్రంపై బయల్దేరగా మార్గమధ్యంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కొండపేటును తగులుకుని గుర్రం బోర్లపడిందని... ఆ సమయంలో పాదముద్రలు పడిన ఆనవాళ్లున్నాయని ఆయన తెలిపారు. మైదుకూరు మండలం చెర్లోపల్లెకు చెందిన చింతకుంట బాలవీరయ్య బ్రహ్మంగారి పాదాలకు గుడి నిర్మించాలని సంకల్పించినట్లుగా స్థానికులు తెలిపారని ఆయన వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!