కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి

కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని, నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Published : 27 Nov 2022 04:27 IST

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

ఈనాడు, దిల్లీ: కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని, నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో దిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఎర్రోళ్ల మాట్లాడారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్‌, ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, జాతీయ సలహాదారుడు ఆళ్ల రామకృష్ణ, హరియాణా అధ్యక్షుడు చంద్రహాస్‌, యూపీ అధ్యక్షుడు ఎస్‌.ఎల్‌.పాల్‌, దిల్లీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రమేష్‌, సంజయ్‌ సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు