నర్మెట్టలో కొత్తరాతియుగపు అమ్మదేవత మట్టి శిల్పం

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు కొత్త తెలంగాణ బృందం తెలిపింది.

Published : 27 Nov 2022 04:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు కొత్త తెలంగాణ బృందం తెలిపింది. బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ దీన్ని గుర్తించారని కొత్త తెలంగాణ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. ‘‘అంతర్జాతీయ పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు కర్ణాటకలోని రవి కొరిసెట్టర్‌ వీటి ఫొటోలు పరిశీలించి.. పాకిస్థాన్‌లోని ‘మెహర్‌ ఘర్‌’ తవ్వకాల్లో లభించిన కొత్త రాతియుగానికి చెందిన ‘మదర్‌ ఆఫ్‌ పెర్ల్‌’ని పోలిఉందని అభిప్రాయపడ్డారు. చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సైతం ఈ మట్టి బొమ్మ కొత్తరాతియుగం (క్రీ.పూ.6,500-క్రీ.పూ.1800 వరకు)కు చెందిందేనని చెప్పారు. తెలంగాణ వారసత్వ శాఖ గతంలో నర్మెట్టలో మెగాలిథిక్‌ సమాధుల తవ్వకాలు చేపట్టినప్పుడు ఎన్నో పురాతన వస్తువులు లభించాయి. అక్కడి సమాధిలో వెలుగుచూసిన ఎముకల నగలు విశేషమైనవి’’ అని హరగోపాల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని