ఐటీ విచారణకు నేడు మంత్రి మల్లారెడ్డి బృందం

తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ  ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డిపై చేపట్టిన విచారణ ఆసక్తికరంగా మారింది.

Updated : 28 Nov 2022 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ  ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డిపై చేపట్టిన విచారణ ఆసక్తికరంగా మారింది. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనేక కీలకపత్రాలు, హార్డ్‌డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని మల్లారెడ్డి, ఆయన సన్నిహితులు, ఉద్యోగులు పలువురికి నోటీసులు జారీ చేశారు.  తమపై దాడిచేశారని మల్లారెడ్డి, తమ విధులను అడ్డుకోవడంతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను గుంజుకున్నారని ఐటీ అధికారులు..పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ సోదాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అనుమానితులను ప్రశ్నిస్తుండగా..  ఐటీ అధికారులు మల్లారెడ్డిని విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని