ఇక ప్రధాన టెర్మినల్‌ నుంచే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌(నిష్క్రమణలు) విషయంలో కీలక మార్పులు జరిగాయి. సోమవారం నుంచి ప్రధాన టెర్మినల్‌ నుంచే అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి.

Published : 28 Nov 2022 04:07 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌(నిష్క్రమణలు) విషయంలో కీలక మార్పులు జరిగాయి. సోమవారం నుంచి ప్రధాన టెర్మినల్‌ నుంచే అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణికులు వెళ్లేందుకు వినియోగిస్తున్న తాత్కాలిక టెర్మినల్‌ను మూసివేస్తున్నారు. మరోవైపు విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. తొలుత 2008లో కోటీ 20లక్షల మందికి సేవలందించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని నిర్మించారు. ఆపై ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి ప్రస్తుతం ఏటా రెండుకోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా 2018లో రెండో విడత విస్తరణ పనులు చేపట్టారు. ప్రధాన టెర్మినల్‌ భవనానికి తూర్పున(25,500 చ.మీ.), పశ్చిమ(57,500 చ.మీ.) వైశాల్యంలో విస్తరణ పనులు చేస్తున్నారు.  ఇవి వచ్చే ఏడాదికి పూర్తవుతాయని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు.
విమానాశ్రయం ప్రధాన రహదారిలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ), ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ అరైవల్‌, ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిష్క్రమణ(డిపార్చర్‌), విమానాలకు ఇంధనం నింపే కేంద్రం వద్ద దాదాపు 2 కి.మీ నిడివి మార్గంలో నాలుగు భారీ రోటరీలు నిర్మించారు. తాజాగా గొల్లపల్లి వద్ద కొత్త ద్వారం నుంచి జీఎమ్మార్‌ ఎరీనాకు అనుసంధానంగా నాలుగు వరుసల కొత్త రహదారిని నిర్మించారు. ఇక్కడే మరో రోటరీని ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు