అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గొత్తికోయలకు నోటీసులు

అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అటవీ శాఖాధికారులు ఆదివారం నోటీసులు అందించారు.

Published : 28 Nov 2022 04:07 IST

చంద్రుగొండ, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అటవీ శాఖాధికారులు ఆదివారం నోటీసులు అందించారు. ఈ నెల 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్యకు గురైన నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎఫ్‌డీఓ అప్పయ్య, చంద్రుగొండ రేంజ్‌ పరిధిలోని అటవీశాఖ సిబ్బంది బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు. 2016 తర్వాత గొత్తికోయలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి ఈ ప్రాంతంలో నివసించే హక్కు లేదని ఎఫ్‌డీఓ పేర్కొన్నారు. అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎక్కడి నుంచి వచ్చారో అదే ప్రాంతానికి వెళ్లిపోవాలని కోరారు. అటవీశాఖ సిబ్బంది వెంట ప్రత్యేక పోలీసు బలగాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని