అమెరికాకు మరిన్ని విమానాలు: కేటీఆర్‌

తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు నేరుగా మరిన్ని విమానాలను నడిపేలా కృషి చేస్తున్నామని.. దీనిపై యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు.

Updated : 28 Nov 2022 04:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు నేరుగా మరిన్ని విమానాలను నడిపేలా కృషి చేస్తున్నామని.. దీనిపై యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. ఒక నెటిజన్‌ చేసిన వినతిపై మంత్రి స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్దసంఖ్యలో ప్రయాణికులు అమెరికాకు వెళ్తున్నారని, వారి కోసం నేరుగా విమానాలను నడపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వారానికి 2 రోజులు షికాగోకు నేరుగా విమానాలున్నాయని.. దీంతో పాటు న్యూయార్క్‌, డల్లాస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు సైతం నడపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో విమానాల మ్యూజియం..

హైదరాబాద్‌లో విమానాల మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. అమెరికాలోని టుక్సాన్‌ ఆరిజోనాలో ఉన్న విమానాల మ్యూజియం మాదిరిగానే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను ఒక నెటిజన్‌ కోరారు. దీన్ని పరిశీలించాలని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులను, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కోరతామని కేటీఆర్‌ పేర్కొన్నారు. విమానాశ్రయ అధికారులు స్పందిస్తూ మ్యూజియం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సంబంధిత విభాగంతో చర్చిస్తామని కేటీఆర్‌కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని