సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన్‌కీ బాత్‌లో ఆదివారం ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Published : 28 Nov 2022 04:07 IST

‘మన్‌కీ బాత్‌’లో ప్రత్యేక ప్రస్తావన
వస్త్రంపై జీ-20 చిహ్నం నేసి పంపించిన హరిప్రసాద్‌

ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌-సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన్‌కీ బాత్‌లో ఆదివారం ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్‌ తన చేనేత మగ్గంపై మూడు రోజులు శ్రమించి వస్త్రంపై జీ-20 చిహ్నం తయారు చేసి పంపారని, ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ముగ్ధుడినయ్యానని ప్రధాని పేర్కొన్నారు. హరిప్రసాద్‌ కళా నైపుణ్యం అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉందని కితాబునిచ్చారు. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు ఓ లేఖను హరిప్రసాద్‌ తనకు పంపారని, వచ్చే ఏడాది జరగనున్న జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుండటం గర్వించదగ్గ విషయమని అందులో రాశారని వెల్లడించారు. ఆయనలా అందరూ ఏదో ఒకరకంగా జీ-20తో అనుసంధానం కావాలని ప్రధాని కోరారు. ప్రధాని ప్రశంసల నేపథ్యంలో ఆయనను ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. హరిప్రసాద్‌ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే, దబ్బనం, సూది రంధ్రాల్లో దూరే చీరలను నేశారు. ఇటీవల 15 రోజులపాటు శ్రమించి ఒకే వస్త్రంపై దేశ చిత్రపటం, జాతీయ గీతానికి రూపమిచ్చారు.

నేతన్నలకు మీరూ కానుక ఇవ్వాలి: కేటీఆర్‌  

హరిప్రసాద్‌ తనకు పంపిన ప్రత్యేక బహుమతి గురించి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ.. చేనేత కార్మికులకూ తిరిగి బహుమతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ఆదివారం కోరారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని, సిరిసిల్లలో మరమగ్గాల సమూహాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు