‘టిటా’ లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) సంయుక్తంగా సింగపూర్‌లో నిర్వహించనున్న వరల్డ్ తెలంగాణ ఐటీ సదస్సు (డబ్ల్యూటీఐటీసీ) లోగోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
వచ్చే ఏడాది సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) సంయుక్తంగా సింగపూర్‌లో నిర్వహించనున్న వరల్డ్ తెలంగాణ ఐటీ సదస్సు (డబ్ల్యూటీఐటీసీ) లోగోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఆదివారం టీ హబ్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ సదస్సు నిర్వహణ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ఈ సదస్సులో సాంకేతిక రంగానికి చెందిన ఔత్సాహికులు పాల్గొనాలని సూచించారు. టిటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల మాట్లాడుతూ.. టిటా దశాబ్ది వేడుకల్లో భాగంగా వచ్చే ఏప్రిల్‌లో తెలంగాణ ఐటీ నిపుణులు, ఆవిష్కర్తలు, పరిశోధకులతో సింగపూర్ వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, హెల్త్‌టెక్ వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ తీరుతెన్నులు తదితర అంశాలను విశ్లేషిస్తారని చెప్పారు. టిటా రాష్ట్ర కార్యదర్శి వినయ్, సభ్యులు శ్రీనివాస్, శ్రావణి బాసరాజు, క్రాంతి, వైద్యనాథ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!