ఇంటర్‌ ‘ప్రథమ’ ప్రవేశాలు 4.36 లక్షలే..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇప్పటివరకు 4,36,715 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.

Updated : 29 Nov 2022 05:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇప్పటివరకు 4,36,715 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం 3,187 కళాశాలలు ఉన్నాయి. వాటిలోని 2,728 కళాశాలల్లో చేరిన విద్యార్థులనే ఇంటర్‌బోర్డు అధికారికంగా గుర్తించింది. మరో 459 కళాశాలలకు ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు లభించలేదు. 350కిపైగా కళాశాలలు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తుండటంతో వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి దక్కలేదు. ఆ కళాశాలలకు ఈ ఏడాది మినహాయింపు ఇచ్చి అనుమతులు జారీ చేయాలని ఇంటర్‌బోర్డు పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. అనుమతులు దక్కని మరికొన్ని ప్రైవేట్‌ కళాశాలల్లో 50 వేల మంది వరకు ప్రవేశాలు పొందారు. వాటికి అనుమతి లభిస్తే ఇంటర్‌బోర్డు అడ్మిషన్‌ లాగిన్‌ను మరోసారి ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని