ఏఎంవీఐ ఉద్యోగ ప్రకటన ఇవ్వాలి

రాష్ట్రంలో సహాయ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) పోస్టులకు వెంటనే ప్రకటన విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

Published : 29 Nov 2022 03:33 IST

అభ్యర్థుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సహాయ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) పోస్టులకు వెంటనే ప్రకటన విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సాంకేతిక కారణాల పేరిట టీఎస్‌పీఎస్సీ ప్రకటన ఉపసంహరించుకుని నాలుగు నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కమిషన్‌ కార్యాలయం వద్ద ఏఎంవీఐ ఉద్యోగార్థులు ఆందోళన నిర్వహించారు. విద్యార్హతలపై కమిషన్‌ నుంచి రవాణాశాఖకు వచ్చిన లేఖపై ఆ శాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని వివరించారు. ప్రకటన ఆలస్యమవుతున్న కొద్దీ... కొందరు అభ్యర్థుల వయోపరిమితి దాటిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

సమస్యను పరిష్కరించండి..: హరీశ్‌రావు

ఏఎంవీఐ పోస్టులకు ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని కోరుతూ అభ్యర్థులు ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించి.. అభ్యర్థులకు న్యాయం చేయాలని మంత్రి.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని