‘పోలవరం సర్వే’కు తేదీ ఖరారు చేయండి

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించేందుకు తేదీ ఖరారు చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ సోమవారం లేఖ రాశారు.

Updated : 29 Nov 2022 05:54 IST

ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించేందుకు తేదీ ఖరారు చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ సోమవారం లేఖ రాశారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో జరిగిన పీపీఏ సాధారణ సమావేశంలో ఉమ్మడి సర్వే చేపట్టాలని కోరినా.. స్పష్టత ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. 12వ పీపీఏ సమావేశంలో ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 892 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, వరదల సమయంలో 40 వేల ఎకరాలకుపైగా పంటపొలాలు మునుగుతున్నాయని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఈ నెల 10న ప్రారంభించిన ఉమ్మడి సర్వే అర్ధంతరంగా ముగిసిందని ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు