కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి

నూతన పార్లమెంట్‌ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జెల కాంతం డిమాండ్‌ చేశారు.

Published : 29 Nov 2022 04:15 IST

ఈనాడు, దిల్లీ: నూతన పార్లమెంట్‌ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జెల కాంతం డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ‘భారత రాజ్యాంగ రక్షణ మహా ధర్నా’ పేరిట దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద పలు రాష్ట్రాలకు చెందిన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంతం మాట్లాడారు. కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, నూతన పార్లమెంట్‌ భవన నామకరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర రాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో సోమవారం భారీ సభ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని