శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకుంటాం: సీసీఎఫ్‌

గొత్తికోయల చేతిలో ఎఫ్‌ఆర్‌వో చలమల శ్రీనివాసరావు హతమవ్వడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌(సీసీఎఫ్‌) బీమానాయక్‌ అన్నారు.

Published : 29 Nov 2022 04:15 IST

బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత 

ఖమ్మం(రఘునాథపాలెం), న్యూస్‌టుడే: గొత్తికోయల చేతిలో ఎఫ్‌ఆర్‌వో చలమల శ్రీనివాసరావు హతమవ్వడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌(సీసీఎఫ్‌) బీమానాయక్‌ అన్నారు. ఎఫ్‌ఆర్‌వో కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలోని ఎఫ్‌ఆర్‌వో నివాసాన్ని సీసీఎఫ్‌ బీమానాయక్‌, ఖమ్మం, భద్రాద్రి డీఎఫ్‌వోలు సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌, రంజిత్‌నాయక్‌ సోమవారం సందర్శించారు. శ్రీనివాసరావు చిత్రపటానికి అంజలి ఘటించి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మేరకు శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇతర హామీలను నెరవేరుస్తామన్నారు. తండ్రి చనిపోయిన బాధలోనూ.. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన శ్రీనివాసరావు కుమార్తె కృతికకు బీమానాయక్‌ కొత్త బూట్లు అందజేసి ప్రోత్సహించారు. శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని