ఫిబ్రవరి నాటికి అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం పూర్తి

హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2022 04:15 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున కొనసాగుతున్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహ పనుల పురోగతిని సోమవారం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కింది భాగంలో పార్లమెంట్‌ భవన ఆకృతి వచ్చేలా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, దాని ప్రకారం పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు విగ్రహం కింది భాగంలో అంబేడ్కర్‌ బాల్యం, విద్యాభ్యాసం, రాజ్యాంగ రచన, దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, ఆడిటోరియం, థియేటర్‌ ఉంటాయన్నారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ ప్రసంగాలు, ఆయన జీవిత చరిత్రపై వచ్చిన సినిమాలోని ముఖ్య వీడియోలు ఇక్కడ ప్రదర్శించనున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని