శిథిల భవనం.. భయం భయం..!

ఇది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పోచమ్మ సెంటర్‌ ప్రాథమిక పాఠశాల భవనం.

Published : 29 Nov 2022 04:15 IST

ఇది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పోచమ్మ సెంటర్‌ ప్రాథమిక పాఠశాల భవనం. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆరేళ్ల కిందట దీన్ని మూసివేశారు. ఫలితంగా ఈ భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఇక్కడే రెండు గదుల్లో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. భవనం ముందటి భాగం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అక్కడే పిల్లలు ఆడుకుంటున్నారు. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, ఆత్మకూరు(హనుమకొండ జిల్లా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని