పాలరాపుగుట్టపై రాబందుల సందడి

కుమురం భీం జిల్లాలో మూడేళ్ల తర్వాత మళ్లీ రాబందుల జంట కనిపించింది.

Published : 29 Nov 2022 04:15 IST

కుమురం భీం జిల్లాలో మూడేళ్ల తర్వాత మళ్లీ రాబందుల జంట కనిపించింది. పెంచికల్‌పేట్ మండలంలోని పాలరాపుగుట్ట వద్ద ఉన్న పొడుగుముక్కు రాబందుల గూళ్లు 2019లో కురిసిన వర్షాలకు కూలిపోగా.. అక్కడ నివసిస్తున్న దాదాపు 10 రాబందులు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని కమలాపూర్‌ ఆవాస కేంద్రానికి తరలివెళ్లాయి. అప్పటినుంచి మళ్లీ తిరిగి రాలేదు. తాజాగా రెండు, మూడు జతల రాబందులు ఈ గుట్ట వద్ద ఎగురుతుండటాన్ని అధికారులు గమనించారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు డీఎఫ్‌ఓ దినేష్‌కుమార్‌ తెలిపారు.

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని