మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు: సీఎస్
తెలంగాణలో మరో 16,940 పోస్టుల భర్తీకి రెండు మూడురోజుల్లో అనుమతులు ఇచ్చి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మరో 16,940 పోస్టుల భర్తీకి రెండు మూడురోజుల్లో అనుమతులు ఇచ్చి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్, వైద్య, పోలీసు, గురుకుల విద్యాలయాల నియామక మండలి, జిల్లా ఎంపిక కమిటీ తదితర సంస్థల ద్వారా ఈ నియామకాలు జరుగుతాయన్నారు. ప్రక్రియలో తప్పక సమయపాలన పాటిస్తూ, నిర్ణీత కాలపరిమితితో వీటిని చేపడతామన్నారు. ఉద్యోగ నియామకాలపై మంగళవారం ఆయన బీఆర్కే భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతికుమారి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, జీఏడీ, వ్యవసాయ, వైద్యఆరోగ్య, దళిత అభివృద్ధి శాఖల కార్యదర్శులు శేషాద్రి, రఘునందన్‌రావు, రిజ్వి, రాహుల్ బొజ్జా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో పలు కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఇంకా 16,940 పోస్టులకు ఆర్థికశాఖతో పాటు ఇతర శాఖల నుంచి అనుమతులిస్తామన్నారు. ఈ పోస్టులకు సంబంధించి సర్వీసు నిబంధనల్లో మార్పులు, ఇతర అంశాలపై వివరాలను సంబంధిత శాఖలు సర్వీస్ కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి