Published : 01 Dec 2022 04:47 IST

ఆగ్రో ఇండస్ట్రీస్‌ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా తిప్పన

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తిప్పన విజయసింహారెడ్డిది రాజకీయ కుటుంబం. తండ్రి తిప్పన కృష్ణారెడ్డి మూడుసార్లు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం కేసీఆర్‌ మిర్యాలగూడకు వచ్చిన ప్రతి సందర్భంలో తిప్పన కృష్ణారెడ్డి గురించి గుర్తు చేస్తుంటారు. కేసీఆర్‌తో ఉన్న అనుబంధంతోనే విజయసింహారెడ్డికి పదవి దక్కింది. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts