సీఎం దృష్టికి తీసుకెళ్లి జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తాం

రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

Published : 01 Dec 2022 04:47 IST

పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. విధినిర్వహణలో గాయపడిన ఆదిలాబాద్‌ జిల్లా నేరెడుగొండ మండలం పీచర గ్రామ కార్యదర్శి రాజ్‌కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారమిక్కడ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు మంత్రిని కలిశారు. కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో శశిధర్‌గౌడ్‌, ఆకారపు సురేష్‌, ప్రవీణ్‌, గర్వందుల శ్రీకాంత్‌గౌడ్‌, లక్ష్మీనారాయణ, పృథ్వి, శివ, భాస్కర్‌, పాషా, వినయ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని