నెల రోజుల్లో సచివాలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

సచివాలయ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, అన్ని అంతస్తుల్లో ఒకేసారి పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు, గుత్తేదారులకు స్పష్టం చేశారు.

Published : 01 Dec 2022 05:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: సచివాలయ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, అన్ని అంతస్తుల్లో ఒకేసారి పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు, గుత్తేదారులకు స్పష్టం చేశారు. బుధవారం ఆయన అంబేద్కర్‌ సచివాలయ భవన ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు. రెడ్‌శాండ్‌ స్టోన్‌ ఏర్పాటు చేస్తూ పోర్టికో, మెట్ల మార్గం, ఫ్లోరింగ్‌, రెయిలింగ్‌ తదితర పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు ఐ.గణపతిరెడ్డి, సత్యనారాయణ, లింగారెడ్డి, శిశిధర్‌, వాస్తునిపుణులు సుధాకర్‌ తేజ, ఆర్కిటెక్ట్‌ ఆస్కార్‌ పొన్ని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని