అంతర్జాతీయ సదస్సుకు ఆద్య కళాబృందం

వందల ఏళ్లుగా నిరాదరణకు గురవుతున్న చరిత్ర తాలూకు పురాతన ఆనవాళ్లను ఆద్య కళ ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, ఆచార్య గూడూరు మనోజకు అరుదైన గౌరవం లభించింది.

Published : 02 Dec 2022 04:00 IST

ఫ్రాన్స్‌లో ప్రసంగించనున్న ఆచార్య తిరుమలరావు, ఆచార్య మనోజ

ఈనాడు, హైదరాబాద్‌: వందల ఏళ్లుగా నిరాదరణకు గురవుతున్న చరిత్ర తాలూకు పురాతన ఆనవాళ్లను ఆద్య కళ ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, ఆచార్య గూడూరు మనోజకు అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వాలని ఈ ఆద్య కళాబృందానికి ఆహ్వానం అందింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగే సదస్సులో తాము పాల్గొననున్నట్లు జయధీర్‌ తిరుమలరావు గురువారం తెలిపారు. ఇండో-యూరోపియన్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌లో ‘నాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌’ వేదికగా ‘భారత్‌-ఆఫ్రికా మానవీయ శాస్త్రాల సంభాషణ’ అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఆద్య కళ బృంద పరిశోధన కృషి, కళాఖండాల చారిత్రక విశేషాలు, ప్రదర్శనశాల ఏర్పాటు అంశాలపై జయధీర్‌ తిరుమలరావు పత్రసమర్పణ చేయనున్నారు. భారతీయ, తెలంగాణ, ఆదివాసీ, గిరిజన జానపద, సంచార సమూహాల సంగీతవాద్యాలు, లోహ కళలు రాత ప్రతులు, పనిముట్లు తదితర విశేషాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించనున్నట్లు ఆద్య కళ సమన్వయకర్త, పాలమూరు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు గూడూరు మనోజ తెలిపారు. అంతకుముందు డిసెంబరు 6న పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సాంస్కృతిక రాయబారి వి.శర్మతో వారు సమావేశం కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని