సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనానికి అస్సాం బృందం

సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాంకేతిక నిపుణుల బృందం ఈ నెలలో తెలంగాణలో పర్యటించనుంది.

Published : 02 Dec 2022 04:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాంకేతిక నిపుణుల బృందం ఈ నెలలో తెలంగాణలో పర్యటించనుంది. బాహుబలి పంపులతో నీటిని మళ్లించే కాళేశ్వరం ఎత్తిపోతలు, అనతి కాలంలోనే నిర్మాణాలు పూర్తి చేసుకున్న లక్ష్మీ, సరస్వతి, పార్వతి జలాశయాలతో పాటు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ తదితర నిర్మాణాలను నిపుణులు పరిశీలించనున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ నీటిపారుదల శాఖకు ఈ మేరకు సమాచారం అందింది.

విద్యుత్‌ సామగ్రి కొనుగోలుకు నిధుల కోసం లేఖ

జులై నెలలో గోదావరికి వచ్చిన భారీ వరదలకు కాళేశ్వరం ఎత్తిపోతల్లో మునిగిపోయిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌసుల్లోని విద్యుత్‌ సామగ్రి మరమ్మతులకు అవసరమైన నిధులు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. అన్నారం పంపుహౌసులో ఇప్పటికే నాలుగు పంపుల పునరుద్ధరణ పూర్తవడంతో పాటు నీటిని ఎత్తిపోశారు. మిగిలిన పంపులు, మేడిగడ్డ జలాశయం సమీపంలోని కన్నెపల్లి పంపుహౌసులోని పంపులు నడపాలంటే ప్యానెల్‌ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటి కొనుగోలుకు దాదాపు రూ.20 కోట్ల వరకు నిధులు అవసరం ఉందని ట్రాన్స్‌కో నివేదించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని