చెక్కుల గడువు పెంచాలని బ్యాంకులకు ఆదేశం

కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అసువులు బాసిన పంజాబ్‌, హరియాణాలకు చెందిన 709 రైతు కుటుంబాలన్నింటికీ సాయం అందేలా చూస్తామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

Published : 02 Dec 2022 04:25 IST

రైతు కుటుంబాలన్నింటికీ సాయం: సీఎస్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అసువులు బాసిన పంజాబ్‌, హరియాణాలకు చెందిన 709 రైతు కుటుంబాలన్నింటికీ సాయం అందేలా చూస్తామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఆ పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెక్కులను పంపిణీ చేయగా... కొన్ని కుటుంబాల వారు గడువులోగా వాటిని డిపాజిట్‌ చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించడానికి ఆయా బ్యాంకులకు ఆదేశాలిచ్చామన్నారు. ‘‘పంజాబ్‌, హరియాణాల్లోని రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ మే 22న 1010 చెక్కులను పంపిణీ చేశారు. బ్యాంకు నిబంధనల మేరకు నిర్దేశిత మూడు నెలల సమయం లోగా వాటిని ఆయా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలి. ఇంకా 196 మంది సకాలంలో చెక్కులను డిపాజిట్‌ చేయకపోవడంతో నగదు చెల్లింపులను బ్యాంకులు నిలిపివేశాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి చెక్కులను రీవ్యాలిడేట్‌ చేసి నగదు ఇవ్వాలని ఆదేశించాం. దీని పర్యవేక్షణకు రెవెన్యూ సంయుక్త కార్యదర్శి రాంసింగ్‌ను నియమించాం’’ అని సీఎస్‌ పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు