గిరిజనుల్లో వెలుగుచూస్తున్న సికిల్‌సెల్‌, తలసీమియా..

కుమురంభీం జిల్లాలో పలువురు గిరిజన విద్యార్థుల్లో సికిల్‌సెల్‌, తలసీమియా వ్యాధులు వెలుగుచూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 40 ఏళ్లలోపు గిరిజనులందరికీ రక్త పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది.

Published : 02 Dec 2022 04:26 IST

ఆరు జిల్లాల్లో పెద్దఎత్తున రక్తపరీక్షలు నిర్వహిస్తున్న యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: కుమురంభీం జిల్లాలో పలువురు గిరిజన విద్యార్థుల్లో సికిల్‌సెల్‌, తలసీమియా వ్యాధులు వెలుగుచూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 40 ఏళ్లలోపు గిరిజనులందరికీ రక్త పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. కుమురంభీం జిల్లాలో వివిధ వసతి గృహాల్లోని 8,542 మంది గిరిజన విద్యార్థుల రక్త నమూనాలు పరిశీలించగా.. ఆరుగురిలో సికిల్‌సెల్‌, నలుగురిలో తలసీమియా వ్యాధులు బయటపడ్డాయి. 375 మందిని సికిల్‌సెల్‌ క్యారియర్లుగా గుర్తించారు. అలానే 642 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా 64 మందికి సికిల్‌సెల్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్‌, ఖమ్మం, ములుగు జిల్లాల్లో 40 ఏళ్లలోపు గిరిజనుల రక్త నమూనాలను పరీక్షించాలని జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆయా డీఎంహెచ్‌ఓలకు నవంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత 15-19 సంవత్సరాల మధ్య యువతీ యువకులకు వచ్చే రెండు నెలల్లో పరీక్షలు పూర్తి చేయనున్నట్లు కుమురంభీం జిల్లా డీఎంహెచ్‌ఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు