దివ్యాంగుల సేవలకు కొత్త ఆవిష్కరణలు

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దివ్యాంగులకు ఉత్తమ సేవలందించేందుకు తెలంగాణలో కొత్త ఆవిష్కరణలు మొదలవడం హర్షణీయమని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి అన్నారు.

Updated : 03 Dec 2022 05:38 IST

రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దివ్యాంగులకు ఉత్తమ సేవలందించేందుకు తెలంగాణలో కొత్త ఆవిష్కరణలు మొదలవడం హర్షణీయమని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దివ్య, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజతో కలిసి ఆయన ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించేందుకు ఈ-మొబైల్‌ యాప్‌ను రూపొందించామన్నారు. శనివారం నుంచి అందుబాటులోకి రానున్న యాప్‌లో దివ్యాంగుల చట్టాలు, వారికి ప్రభుత్వం అందించే పథకాలను పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశి నేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈఓ ఎస్వీ కృష్ణన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని