కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ప్రతి పంపండి
దిల్లీ మద్యం కేసులో సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నకలును తనకు అందించాలని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిల్లీలోని సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు.
ఎఫ్ఐఆర్ నకలు కూడా కావాలి
సీబీఐ డీఎస్పీకి ఎమ్మెల్సీ కవిత లేఖ
వాటిని చూశాక నోటీసుపై వివరణ ఇస్తానని వెల్లడి
ఉదయం సీఎంతో భేటీ... తాజా పరిణామాలపై చర్చ
ఈనాడు, హైదరాబాద్: దిల్లీ మద్యం కేసులో సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నకలును తనకు అందించాలని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిల్లీలోని సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా అందించాలని కోరారు. తద్వారా తనకు వివరణ ఇవ్వడం తేలిక అవుతుందని తెలిపారు. ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ ఇచ్చే తేదీని ఖరారు చేసి, హైదరాబాద్‌లో కలుద్దామని వివరించారు. దిల్లీ మద్యం కేసులో కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లో గానీ, దిల్లీలో గానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో తెలియజేయండి. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా ఆ అంశాలపై మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది’’ అని సీబీఐ ఆ నోటీసులో పేర్కొంది. హైదరాబాద్‌లోని నివాసంలో వివరణ తీసుకోవచ్చని అధికారులకు తెలియజేసినట్లు శుక్రవారం రాత్రి కవిత వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కోరుతూ సీబీఐ డీఎస్పీకి ఆమె లేఖ రాశారు.
కవితకు సీఎం భరోసా
శనివారం ఉదయం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. తనకు వచ్చిన నోటీసుల ప్రతిని అందజేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పినట్లు తెలిసింది. సీబీఐ నోటీసుల వెనుక దురుద్దేశం ఉందని, దానికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ కక్షల కారణంగా ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా పోరాడాలని, న్యాయపరంగా దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన తర్వాత కవిత సీబీఐ డీఎస్పీకి లేఖ రాశారు.
తెరాస నేతల సంఘీభావం
సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెరాస నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో శనివారం హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెకు, సీఎంకు అనుకూలంగా, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెకు మద్దతుగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భార్య మేజర్ కాదు.. పెళ్లయిన నాలుగేళ్లకు కోర్టుకెక్కిన భర్త
-
India News
DGCA: విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ అయితే 75% డబ్బులు వెనక్కి
-
General News
Nara Lokesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Andhra News: కుమార్తె వరసయ్యే బాలికపై అత్యాచారం, హత్య.. కామాంధుడికి ఉరిశిక్ష
-
India News
Supreme Court: ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. నేటినుంచి అందరికీ అందుబాటులోకి..