Hyderabad: గోల్డ్ ఏటీఎం.. ఎప్పుడంటే అప్పుడే బంగారం డ్రా చేసుకోవచ్చు..
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు.
దేశంలోనే తొలి సారిగా హైదరాబాద్‌లో ప్రారంభం
బేగంపేట, న్యూస్‌టుడే: దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు. ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ తెలిపారు. బంగారు నాణేలతోపాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం