పెట్టుబడులకు ప్రభుత్వ భరోసా

తెలంగాణలో భారీఎత్తున పరిశ్రమల స్థాపనకు కెనడా పారిశ్రామికవేత్తలు తరలిరావాలని.. వారి పెట్టుబడులకు ప్రభుత్వపరంగా భరోసా కల్పిస్తామని, రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Published : 04 Dec 2022 04:55 IST

కెనడా వాణిజ్యమండలి అధ్యక్షుడు గోల్డి హైదర్‌తో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భారీఎత్తున పరిశ్రమల స్థాపనకు కెనడా పారిశ్రామికవేత్తలు తరలిరావాలని.. వారి పెట్టుబడులకు ప్రభుత్వపరంగా భరోసా కల్పిస్తామని, రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీవశాస్త్రాలు, ఐటీ, వాహన, విద్యుత్‌తో పాటు ఇతర అన్ని రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలమని పేర్కొన్నారు. కెనడా వాణిజ్య మండలి అధ్యక్షుడు, సీఈఓ గోల్డి హైదర్‌, ట్రేడ్‌ కమిషనర్‌ విక్రం జైన్‌లు శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కెనడా వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలపై మంత్రి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, త్వరలోనే కెనడా వాణిజ్య బృందం పర్యటిస్తుందని గోల్డి హైదర్‌ తెలిపారు. ఈ సందర్భంగా గోల్డి హైదర్‌, విక్రమ్‌ జైన్‌లను మంత్రి కేటీఆర్‌ సత్కరించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

స్రవంతి చదువుకు సాయమందిస్తాం: కేటీఆర్‌

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని స్రవంతిని ఆదుకుంటామని, బీఎస్సీ(హార్టికల్చర్‌) కోర్సు చదివేందుకు సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. ఓ నెటిజన్‌ స్రవంతి గురించి ట్వీట్‌ చేయగా ఆయన స్పందించారు. తమ అధికారులు ఆమెను సంప్రదించి, సాయం అందిస్తారని పేర్కొన్నారు. స్రవంతి పరిస్థితిపై ‘ఈనాడు’లో శనివారం ‘‘తల్లడిల్లుతోంది.. చదువుల తల్లి’’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని