స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిరిసిల్లకు తొలిస్థానం

స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ)లో భాగంగా నవంబరు నెలకు ఇచ్చిన సూచికల మేరకు ప్రగతిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది.

Published : 04 Dec 2022 04:55 IST

నాలుగు జిల్లాలకు ఫోర్‌స్టార్‌ రేటింగ్‌
త్రీస్టార్‌ కేటగిరీలో మూడు జిల్లాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ)లో భాగంగా నవంబరు నెలకు ఇచ్చిన సూచికల మేరకు ప్రగతిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. బహిరంగ విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్‌) ప్లస్‌ కేటగిరీలో ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే తొలిస్థానం సాధించింది. గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించడం, అన్ని సంస్థల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, కంపోస్టు షెడ్ల నిర్మాణం, గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ, పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు వాల్‌ పెయింటింగ్‌ వేయడం ప్రమాణాలుగా ఈ సర్వే జరిగింది. నవంబరులో ఈ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ను ఆరు జిల్లాలు పొందితే అందులో నాలుగు జిల్లాలు తెలంగాణ నుంచి ఉన్నాయి. సిరిసిల్లతో పాటు కరీంనగర్‌ (4వ స్థానం) మేడ్చల్‌ (5వ స్థానం), పెద్దపల్లి (6వ స్థానం) జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. త్రీస్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి పది జిల్లాల్లో మూడు తెలంగాణలో ఉన్నాయి. ఈ కేటగిరీలో జగిత్యాల జిల్లా 5వ ర్యాంకు, ఖమ్మంజిల్లా ఆరోర్యాంకు, సూర్యాపేట జిల్లా తొమ్మిదో ర్యాంకు సాధించాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు