దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శం

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Published : 04 Dec 2022 04:55 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని తెలిపారు. ‘‘దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటోంది. అవకాశమున్న ప్రతిచోట వారి ఆత్మ గౌరవాన్ని, సాధికారతను పెంచే దిశగా అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. దేశంలో తొలిసారిగా వారి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. కేంద్రం సైతం తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి పురస్కారాలు అందించింది’’ అంటూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి రూ.3,016 చొప్పున పింఛను అందిస్తున్నాం. వారికి రెండు పడకగదుల ఇళ్లు, దళితబంధు పథకాలతోపాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్‌ లభిస్తోంది. ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్‌ను అమలుచేస్తున్నాం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ఉచిత శిక్షణ ఇస్తున్నాం.  రాబోయే కాలంలో వారి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.’’ అని సీఎం పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని