తగ్గుముఖం పట్టిన లంపీస్కిన్‌ వ్యాధి

లంపీస్కిన్‌ (ముద్దచర్మం) వ్యాధితో రాష్ట్రంలో మొత్తం 65 పశువులు మృత్యువాతపడ్డాయి.

Published : 04 Dec 2022 04:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: లంపీస్కిన్‌ (ముద్దచర్మం) వ్యాధితో రాష్ట్రంలో మొత్తం 65 పశువులు మృత్యువాతపడ్డాయి. రెండునెలలుగా రాష్ట్రంలో పశువులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఈ వ్యాధి ఇప్పుడు దాదాపు పూర్తిగా తగ్గిందని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. ప్రస్తుతం వ్యాధి సోకిన పశువులు ఎక్కడా లేవన్నారు. వ్యాధి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 35 లక్షల పశువులకు టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా గేదె జాతి పశువులకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు