తొలిమెట్టు టాస్క్‌ఫోర్స్‌ ఉత్తర్వుల నిలిపివేత

తొలిమెట్టు కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (డీఏటీఎఫ్‌)ను ఏర్పాటు చేస్తూ గత నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది.

Published : 04 Dec 2022 04:55 IST

ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలే కారణం!

ఈనాడు, హైదరాబాద్‌: తొలిమెట్టు కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (డీఏటీఎఫ్‌)ను ఏర్పాటు చేస్తూ గత నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులోని సభ్యులు తమపై ఒత్తిడి పెంచుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమను అవమానపరుస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు గత కొన్ని రోజులుగా అభ్యంతరాలు తెలుపుతున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ను రద్దుచేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో గత నెలలో జారీచేసిన ఉత్తర్వులను పరిపాలనాపరమైన కారణాల వల్ల నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ సంచాలకురాలు తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే.. ఆ ఉత్తర్వులను హోల్డ్‌లో పెట్టకుండా రద్దు చేయాలని టీఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య డిమాండ్‌ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు