74 ఆలయాల్లో పూజా సేవల విస్తరణ
తెలంగాణలోని 74 ఆలయాల్లో ప్రస్తుతం ఉన్న పూజలకు తోడు మరికొన్ని పూజాసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
అందుబాటులోకి చండీహోమం, ఆశీర్వచన సేవలు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని 74 ఆలయాల్లో ప్రస్తుతం ఉన్న పూజలకు తోడు మరికొన్ని పూజాసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి భక్తులకు రాహుకేతు పూజ, చండీహోమం, ఆశీర్వచనం తదితర సేవలను అందించనున్నట్లు చెప్పారు. శనివారం ఇక్కడి అరణ్యభవన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. శ్రీవైష్ణవ, శివాలయాలు, అమ్మవారి ఆలయాల్లో ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న పూజలను ఇతర ఆలయాలకు విస్తరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఆలయాల వారీగా అందుబాటులోకి ఉండనున్న పూజల సమాచారాన్ని దేవాదాయ శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు వివరించారు.
గజిట్లోకి ఆలయ భూములు
ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా వాటి వివరాలను గజిట్ పరిధిలోకి తీసుకువస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 1,300 ఎకరాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 3,000 ఎకరాల ఆలయ భూములను గజిట్లో నమోదు చేశామని వివరించారు. అందుకు సంబంధించిన గజిట్ పత్రాలను దేవాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణితో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, సికింద్రాబాద్ ఆలయ సహాయ కమిషనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!