తెలంగాణ ప్రభుత్వంతో కాయిన్‌బేస్‌ ఒప్పందం

తెలంగాణలో వెబ్‌ 3.0 సాంకేతిక సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన కాయిన్‌బేస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 05 Dec 2022 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వెబ్‌ 3.0 సాంకేతిక సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన కాయిన్‌బేస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కాయిన్‌బేస్‌ డైరెక్టర్‌ కేటీ మిచల్‌లు సంతకాలు చేశారు. ఐటీ శాఖ సంయుక్త సంచాలకురాలు రమాదేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యాధునిక వెబ్‌ 3.0 పరిజ్ఞానం కొన్ని దేశాల్లోనే ఉందని, ఇప్పుడు అది తెలంగాణకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్‌చెయిన్‌ తదితర నవీన సాంకేతికతలతో  ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. వెబ్‌ 3.0 పరిజ్ఞానం ద్వారా  రాష్ట్రం మరింత పురోగతి  సాధిస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని